ట్రంప్‌కు షాకిచ్చిన పుతిన్
- November 30, 2017
ఉత్తర కొరియా విషయంలో అమెరికాకు రష్యా ఊహించన షాక్ ఇచ్చింది. వరుస ఖండాండర క్షిపణుల (ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్) ప్రయోగాలతో అంతర్జాతీయ సమాజాన్ని ఉత్తర కొరియా భయభ్రాంతులుకు గురిచేస్తోంది. ముఖ్యంగా అమెరికాపై ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియాతో ప్రపంచదేశాలు ఆర్థిక, రాజకీయ, దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకోవాలని ట్రంప్ కోరారు. ఈ నేపథ్యంలో ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకోవాలంటూ.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌లో కోరారు. అయితే ఉత్తర కొరియా సంబంధాలను తెంచుకునేది లేదని పుతిన్ స్పష్టం చేసినట్లు రష్యా మీడియా వర్గాలు ప్రకటించాయి. ఇప్పటికే ఉత్తర కొరియామీద కఠినమైన ఆంక్షలను విధించారని.. అంతమించి చర్యలు తీసుకోవాల్సి అవసరం లేనట్లు అమెరికాకు రష్యా తెలిపింది. అమెరికా తీసుకుంటున్న చర్యలు.. ఉత్తర కొరియాను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని రష్యా పేర్కొంది.
ఇటీవల ఉత్తర కొరియా జరిపిన ఖండాంతర క్షిపణి ప్రయోగంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో జరిగిన అత్యవసర సమావేశంలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ.. ఉత్తర కొరియా యుద్ధానికి కాలుదువ్వుతోందని చెప్పారు. ఒక వేళ యుద్ధమే సంభవిస్తే.. ఉత్తరకొరియాను ధ్వంసం చేస్తామని ఆమె హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష