విశాల్‌ కోసం ధనుష్‌ పాడిన పాట

- November 30, 2017 , by Maagulf
విశాల్‌ కోసం ధనుష్‌ పాడిన పాట

చెన్నై: లింగుస్వామి దర్శకత్వంలో విశాల్‌ కథానాయకుడిగా 'సండకోళి-2' నిర్మితమవుతున్న విషయం తెలిసిందే. విశాల్‌ ఫిలిమ్‌ ఫ్యాక్టరీ దీన్ని నిర్మిస్తోంది. కీర్తి సురేష్‌, వరలక్ష్మి కథానాయికలు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించనున్నారు. ఇందులో ఓ పాటను ప్రముఖ నటుడు ధనుష్‌తో పాడించాలని భావించి, ఆయనను సంప్రదించారు. వెంటనే అంగీకరించిన ధనుష్‌ ఆ గీతాన్ని ఆలపించి తన స్నేహాన్ని చాటుకున్నారు. విశాల్‌ కోసం ధనుష్‌ పాడిన పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com