డబ్బింగ్ పనులు పూర్తిచేసిన విక్రమ్
- November 30, 2017
చెన్నై: 'మూవీ ఫ్రేమ్' బ్యానరుపై కలైపులి ఎస్.థాణు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న చిత్రం 'స్కెచ్'. ఇందులో విక్రమ్ కథానాయకుడు. ఆయనకు జంటగా తమన్నా నటిస్తున్నారు. హాస్య నటుడు సూరి, ఆర్కే సురేష్, అరుళ్దాస్, హరీశ్, శ్రీమాన్, మధుమిత ఇతర తారాగణం. ప్రధాన పాత్రలో శ్రీ ప్రియాంక నటిస్తున్నారు. విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తుండగా.... ఎస్.తమన్ సంగీతం అందించారు. కొంతకాలంగా నిర్మాణ పనులను వేగవంతం చేశారు.
అనంతరం డబ్బింగ్ పనులు చేపట్టారు. ఇటీవల విక్రమ్ సుమారు పది రోజులపాటు సమయం కేటాయించి నిర్విరామంగా తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. బుధవారంతో ఇవి పూర్తయినట్లు చిత్ర బృందం వివరించింది. విక్రమ్ ఈ చిత్రం కోసం ఓ పాట ఆలపించారు.
ఆడియో విడుదల కార్యక్రమం త్వరలో జరుగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు