టిజి క్లాప్ తో ప్రారంభమైన రాయలసీమ లవ్ స్టోరీ

- November 30, 2017 , by Maagulf
టిజి క్లాప్ తో ప్రారంభమైన రాయలసీమ లవ్ స్టోరీ

ప్రముఖ పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు టిజి.వెంకటేష్‌ క్లాప్‌తో రాయలసీమ లవ్‌స్టోరీ చిత్రం షూటింగ్‌ మొదలైంది. కర్నూల్‌లోని ఒక హోటల్లో హీరో వెంకట్‌, హీరోయిన్‌లు హృశాలి, పావనిలపై తొలి సన్నివేశం చిత్రీకరించారు. నర్వా రాజశేఖర్‌ రెడ్డి కెమెరా స్విచాన్‌ చేశారు. టిజి.వెంకటేష్‌ తనయుడు టిజి.భరత్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఇప్పటి వరకు వచ్చిన రాయలసీమ కథల చిత్రాల్లో పగ, ప్రతీకారం అంటూ తీశారు. రాయలసీమ అంటే ఫ్యాక్షన్‌ కాదు నిండైన మనసున్న వాళ్ళు అని చాటి చెప్పడానికి ముందుకు వచ్చిన దర్శక నిర్మాతలను అభినందిస్తున్నానని టిజి.వెంకటేష్‌ అన్నారు. ఈ రాయలసీమ లవ్‌స్టోరీ సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నాను. సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం కర్నూల్‌ అని ఆయన చెప్పారు చిత్ర నిర్మాతలు నాగరాజు, హుస్సేన్‌, ఇమ్మాన్యయేల్‌ మాట్లాడుతూ రామ్‌ రణధీర్‌ చెప్పిన కథ నచ్చడంతో అతడికే దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పి ఈ సినిమా తీస్తున్నాం అన్నారు. 
చిత్ర దర్శకుడు రామ్‌ రణధీర్‌ మాట్లాడుతూ రాయలసీమ నేపథ్యంలో ఇప్పటి వరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా మా సినిమా ఉంటుంది. ముక్కోణపు ప్రేమకథతో తీస్తున్నాం. కర్నూల్‌ నగంరలో పది రోజులు షూటింగ్‌ చేస్తాం. తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com