మరో దగ్గుబాటి హీరో వచ్చేస్తున్నాడు

- December 01, 2017 , by Maagulf
మరో దగ్గుబాటి హీరో వచ్చేస్తున్నాడు

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే చాలామంది వారసులు ఎంట్రీ ఇచ్చి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటే , తాజాగా దగ్గుపాటి ఫ్యామిలీ నుండి మరో హీరో రాబోతున్నాడు. సురేష్ బాబు రెండో కుమారుడు అభిరాం సినీ ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే వెంకటేష్ , రానా లు హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకొని సక్సెస్ కాగా ఇప్పుడు ఇదే బాటలో అభిరామ్ రాబోతున్నాడు.
గతంలో మోహన్ బాబు, శర్వానంద్ తో 'రాజు మహారాజు' చిత్రానికి దర్శకత్వం వహించిన 'భాను శంకర్' అభిరామ్ ను పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంభందించి ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టగా , తాజాగా అభిరామ్ కు జోడి కట్టే హీరోయిన్ ను కూడా ఫైనల్ చేసారు. మాళవిక శర్మ ను ఈ మూవీ లో హీరోయిన్ గా తీసుకున్నారట. త్వరలోనే ఈ చిత్ర ప్రారంభాన్ని రామానాయుడు స్టూడియో లో సినీ ప్రముఖుల సమక్షంలో సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com