కోహ్లీని ప్రశ్నించిన మిస్‌ వరల్డ్‌ మానుషి

- December 01, 2017 , by Maagulf
కోహ్లీని ప్రశ్నించిన మిస్‌ వరల్డ్‌ మానుషి

దిల్లీ: భారత క్రికెట్‌ జట్టు సారథి విరాట్‌ కోహ్లీకి మిస్‌ వరల్డ్‌ మానుషి ఛిల్లర్‌ ఓ ప్రశ్న వేశారు. తాజాగా దిల్లీలో 'సీఎన్‌ఎన్‌ న్యూస్‌ 18' అవార్డుల ప్రదానోత్సవంలో వీరిద్దరూ పాల్గొన్నారు. పాపులర్‌ ఛాయిస్‌ స్పెషల్‌ అఛీవ్‌మెంట్‌ పురస్కారాన్ని కోహ్లీ అందుకున్నాడు.

అనంతరం అక్కడే ఉన్న మానుషి మైక్‌ అందుకుని 'కోహ్లీ మొదటగా అవార్డు అందుకున్న నీకు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రపంచంలోనే బ్యాట్స్‌మెన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నావు. ఎందరో యువ క్రికెటర్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. వీరికి నువ్వు ఇచ్చే సలహాలు, సూచనలు ఏమిటి. ముఖ్యంగా చిన్నారులకు' అని ప్రశ్నించారు.
 
దీనికి కోహ్లీ 'ఆటలో ఎప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ఇక్కడ చాలా ముఖ్యం. ఈ ఆలోచన నీ గుండెల్లోంచి రావాలి. మైదానంలో నువ్వు ఏంటో నిరూపించుకోగలగాలి. లేదంటే నువ్వు అభిమానుల హృదయాలను గెలుచుకోలేవు. నేను మరొకరిలా ఉండాలని ఎప్పుడూ ప్రయత్నించను. నేను ఎప్పుడు నాలాగే ఉంటాను. నా తీరుపై ఎవరికి ఎలాంటి అభ్యంతరాలున్నా వాటి గురించి నేను పట్టించుకోను' అని బదులిచ్చాడు.
అనంతరం మానుషి 'ప్రత్యేక అఛీవ్‌మెంట్‌' అవార్డును కోహ్లీ చేతులమీదుగా అందుకున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com