దుబాయ్ లో 'వేవ్' వారి బాలల దినోత్సవం !!
- November 14, 2015

Wave Resonance ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల్లోనే తొలిసారిగా బాలల దినోత్సవాన్ని శుక్రవారం సాయంత్రం దుబాయ్ లోని భారత రాయబార కార్యాలయం ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం ముంబాయికి చెందిన చిల్డ్రన్ ధియేటర్ సంస్థ నుండి 17 మంది విద్యార్ధులు ప్రత్యేక ప్రదర్శన కోసం విచ్చేశారు. చిల్డ్రన్ ధియేటర్ సంస్థ డైరెక్టర్ శ్రీ రాజు తులా మరియు ప్రొడ్యూసర్ మానస్ విలాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విద్యార్ధుల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. సుధా విజయకుమార్ , దివ్య ఇస్నూరు స్కూల్ డ్రెస్ లో చేసిన వ్యాఖ్యానం సభికులని ఆకట్టుకుంది. ప్రశాంతి శ్రీనివాస్ స్కూల్ డ్రెస్ లో చేసిన స్కిట్ ఆహుతుల్ని నవ్వుల పూవుల్ని పూయించింది. రిత్విక్ అనే 4 ఏళ్ల చిన్నారి 130 దేశాల రాజధానుల పేర్లు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారులంతా తమ తమ స్కిట్స్ ని వేదిక మీద ప్రదర్శించారు. దుబాయ్ లో షేక్ హమదాన్ అవార్డ్ అనేది విద్యార్ధులకి ఇచ్చే అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం. ఈ సంవత్సరం ఈ అవార్డ్ పొందిన విద్యార్ధులకి అభినందనలతో పాటు చిరు సత్కారాన్ని అందించారు. అంతకుముందు వేవ్ రేసోనేన్సు ఫేస్ బుక్ పేజి లో నిర్వహించిన పిల్లల ఫోటో కాంటెస్ట్ లో మొదటిస్థానం పొందిన శ్రీవిద మరియు నిర్మిత , శ్రీరామ్ లకు బహుమతులు అందచేశారు. అలాగే వీడియో కాంటెస్ట్ లో మొదటి స్థానం పొందిన పొనిత్ మరియు విశాల్ , వివాన్ లకు కూడా బహుమతులు అందచేశారు. తొలిసారిగా నిర్వహించిన బాలల దినోత్సవం కావటంతో పిల్లలు , పెద్దలు మొత్తం 500 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఆహుతులంతా పిల్లల కోసం ఇంత చక్కటి కార్యక్రమాన్ని రూపొందించిన వేవ్ నిర్వాహకులు శ్రీ రావెళ్ళ రమేష్ బాబు , గీత దంపతులకు అభినందనలు తెలియచేశారు.
వేవ్ వారికి మాగల్ఫ్.కామ్ తరుపున ప్రత్యేక అభినందనలు.



తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







