ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్
- December 02, 2017
బెంగళూరు: ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ ఎట్టకేలకు కొత్త సీఈవో పేరును ప్రకటించింది. క్యాప్‌జెమినీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సలీల్ పరేఖ్‌ను సీఈవోగా నియమించినట్లు సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. పరేఖ్ క్యాప్‌జెమినీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన వెలువడిన కొద్ది గంటలకే ఇన్ఫోసిస్ నియామక ప్రకటన చేయడం గమనార్హం.
పరేఖ్ ప్రస్తుతం ఫ్రాన్స్‌కు చెందిన ఐటీ సర్వీసెస్ కంపెనీ క్యాప్‌జెమినీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు. ఆయన సంస్థ నుంచి వైదొలుగుతున్నట్లు క్యాప్‌జెమినీ శనివారం ప్రకటించింది. 2018, జనవరి 1 వరకు పరేఖ్ క్యాప్‌జెమినీలో కొనసాగుతారు. జనవరి 2న ఇన్ఫోసిస్ సీఈవోగా బాధ్యతలు చేపడతారు. పరేఖ్.. బాంబే ఐఐటీ నుంచి ఏరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తిచేశారు. కార్నెల్ యూనివర్శిటీలో మాస్టర్స్ చదివారు.
'ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీగా సలీల్ పరేఖ్‌ను కంపెనీలోకి ఆహ్వానించడం ఆనందంగా ఉంది. ఐటీ రంగంలో ఆయనకు దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. పరేఖ్ నేతృత్వంలో ఇన్ఫోసిస్ మరింత ముందుకెళ్తుందని బోర్డు విశ్వసిస్తుంది' అని బీఎస్ఈ ఫైలింగ్ సందర్భంగా ఇన్ఫోసిస్ ఛైర్మన్ నందన్ నీలేకని తెలిపారు.
కంపెనీ వ్యవస్థాపకులతో వచ్చిన భేదాభిప్రాయాల కారణంగా ఈ ఏడాది ఆగస్టులో విశాల్ సిక్కా ఇన్ఫోసిస్ సీఈవో పదవికి అనూహ్యంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న యూబీ ప్రవీణ్ రావుకు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పగించారు. జనవరి 2న ప్రవీణ్ రావు సీఈవో పదవి నుంచి వైదొలిగి పూర్తిస్థాయి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బాధ్యతలను కొనసాగిస్తారని కంపెనీ ఈ సందర్భంగా వెల్లడించింది.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్‌లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్‌కే వీసా కాపీ..!!







