ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా వ్యవహరిస్తున్న అమెరికా,రష్యా
- December 02, 2017
మాస్కో: అమెరికా, రష్యా మధ్య మళ్లీ ప్రచ్ఛన్న యుద్ధం తాలూకా ఛాయలు కన్పిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఇరు దేశాలు ఎడ్డెం అంటే తెడ్డెం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల రష్యా టెలివిజన్ గ్రూప్ ఆర్టీ అమెరికా కాంగ్రెస్‌ను ప్రసారం చేసే హక్కులు కోల్పోయింది. దీంతో అసంతృప్తికి గురైన రష్యా.. అమెరికాకు కౌంటర్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. రష్యా పార్లమెంట్‌ను కవర్ చేయకుండా అమెరికా జర్నలిస్టుపై ఆంక్షలు పెట్టేందుకు సిద్ధమవుతోంది.
ఈ మేరకు రష్యా పార్లమెంట్లో ప్రతిపాదన తీసుకొచ్చారట. ప్రస్తుతం దీనిపై అక్కడి ప్రభుత్వ వర్గాలు పరిశీలనలు జరుపుతున్నాయి. వచ్చే వారం జరగబోయే సమావేశాల్లో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్‌లోని ఎగువసభ, దిగువ సభ ఆమోదం పొందితే అమెరికా జర్నలిస్టులు రష్యా పార్లమెంట్ సమావేశాలను ప్రసారం చేయకుండా నిషేధం విధించే అవకాశం ఉంది. రష్యా అధ్యక్షుడు కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. 'విదేశీ మీడియాపై ఆంక్షలు విధించడం అంటే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను ఉల్లంఘించినట్లే. అయితే ఈ పద్ధతి అమెరికాలోనే మొదలైంది' అని సదరు ప్రతినిధి అన్నారు.
రష్యాకు చెందిన ఆర్టీ మీడియా గ్రూప్‌ను విదేశీ సంస్థగా రిజిస్టర్ చేసుకోవాలని అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇందుకు ఆ సంస్థ ఒప్పుకోలేదు. దీంతో అమెరికా కాంగ్రెస్ సమావేశాలను ప్రసారం చేసే హక్కులను ఆర్టీ కోల్పోయింది.
తాజా వార్తలు
- GCC Secretary-General condemns attacks targeting Saudi Arabia by drones
- సౌదీ చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నాన్ని తీవ్రంగా ఖండించిన యూఏఈ
- ఇరాక్ భూభాగం నుంచి ప్రయోగించిన డ్రోన్లను కూల్చివేసిన సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ
- తెలంగాణ ప్రభుత్వం ‘ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్’ జీవో జారీ
- 14వ ఐటీ బోనాలు ఘనంగా నిర్వహించిన టిటా
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్‌నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!







