ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో సినీ దిగ్గజాలతో పోటీచేయనున్న విశాల్‌

- December 02, 2017 , by Maagulf
ఆర్కేనగర్ ఉపఎన్నికల్లో సినీ దిగ్గజాలతో పోటీచేయనున్న విశాల్‌

చెన్నై: తమిళనాడు రాజకీయాల్లోకి మరో సినీ ప్రముఖుడు రాబోతున్నారు. ఇప్పటికే సినీరంగానికి చెందిన ఇద్దరు ప్రముఖులు రజనీకాంత్‌, కమల్‌హాసన్‌ రాజకీయ రంగ ప్రవేశంపై హాట్‌హాట్‌గా చర్చలు నడుస్తున్నాయి. తాజాగా తమిళ పరిశ్రమకు చెందిన మరో ప్రముఖ నటుడు రాజకీయాల్లోకి వస్తున్నారు. ప్రజల సమస్యలపై వెంటనే స్పందిస్తూ అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు ప్రయత్నిస్తున్న సినీనటుడు విశాల్‌ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా విశాల్‌ పోటీ చేయనున్నారు. సోమవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com