ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- December 03, 2017
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. మంజునాథ్ వివాదంపైనా నేతలకు సూచనలు చేశారు. అంతా సమన్వయం చేసుకోవాలని, కళా వెంకట్రావ్, అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్లకు బాధ్యతలు అప్పగించారు. ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. రిజర్వేషన్‌పై చాలా కాలంగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చామన్నారు చంద్రబాబు. నిబంధనల ప్రకారమే కాపు రిజర్వేషన్ల బిల్లును సభలో ప్రవేశపెట్టామన్నారు. బీసీ కమిషన్‌లోని మెజార్టీ సభ్యుల నివేదిక ఆధారంగా కాపు రిజర్వేషన్లపై నిర్ణయించామన్నారు. అయితే బీసీలకు రిజర్వేషన్లలో కోత పెట్టలేదన్నారు సీఎం. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది కోసం కులాలను రెచ్చగొడుతున్నాయని, టీడీపీ హయాంలోనే బీసీల అభ్యున్నతి జరిగిందని గుర్తు చేశారు. బీసీలను, కాపులను టీడీపీ ఎన్నడూ ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు చంద్రబాబు. ఇదే సమయంలో బీసీ సంఘ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేసిన విమర్శలను పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







