ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

- December 03, 2017 , by Maagulf
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపు రిజర్వేషన్లు, బీసీ సంఘాల ఆందోళన నేపథ్యంలో ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. మంజునాథ్ వివాదంపైనా నేతలకు సూచనలు చేశారు. అంతా సమన్వయం చేసుకోవాలని, కళా వెంకట్రావ్, అచ్చెన్నాయుడు, టీడీ జనార్ధన్‌లకు బాధ్యతలు అప్పగించారు. ఏ వర్గానికీ అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించామన్నారు. రిజర్వేషన్‌పై చాలా కాలంగా ఉన్న డిమాండ్‌ను నెరవేర్చామన్నారు చంద్రబాబు. నిబంధనల ప్రకారమే కాపు రిజర్వేషన్ల బిల్లును సభలో ప్రవేశపెట్టామన్నారు. బీసీ కమిషన్‌లోని మెజార్టీ సభ్యుల నివేదిక ఆధారంగా కాపు రిజర్వేషన్లపై నిర్ణయించామన్నారు. అయితే బీసీలకు రిజర్వేషన్లలో కోత పెట్టలేదన్నారు సీఎం. కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది కోసం కులాలను రెచ్చగొడుతున్నాయని, టీడీపీ హయాంలోనే బీసీల అభ్యున్నతి జరిగిందని గుర్తు చేశారు. బీసీలను, కాపులను టీడీపీ ఎన్నడూ ఓటు బ్యాంకుగా చూడలేదన్నారు చంద్రబాబు. ఇదే సమయంలో బీసీ సంఘ నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య చేసిన విమర్శలను పలువురు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com