నాని కి నా ఫుల్ సపోర్ట్ - నిత్యా

- December 03, 2017 , by Maagulf
నాని కి నా ఫుల్ సపోర్ట్ - నిత్యా

కథల ఎంపికలో హీరో నాని టేస్ట్ బాగుంటుందని చెబుతుంటారు. అందుకే వరుస హిట్స్ తో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు నాని నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. 'వాల్ పోస్టర్' పేరిట సొంత చిత్ర నిర్మాణ సంస్థను నెలకొల్పాడు. ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా 'అ!' పేరిట ఓ చిన్న చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 80 శాతం పూర్తి అయింది. ఇది డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా. తెలుగు సినీ చరిత్రలో ఇంత వరకు ఇటువంటి కథతో సినిమా రాలేదని చెబుతున్నాడు నాని. నాని చేసే ప్రయత్నానికి ఇండస్ట్రీ నుంచి ఫుల్ సపోర్ట్ లభిస్తోంది. యంగ్ హీరో రానా దగ్గుపాటి నాని సపోర్ట్ చేస్తున్నట్టు ట్విట్ చేసిన సంగతి తెలిసిందే. కాజల్, నిత్యా మీనన్, అవసరాల శ్రీనివాస్ నాని 'అ!' సినిమాలో నటిస్తున్నారు. నానితో పాటు రవితేజ ఈ సినిమాకి వాయిస్ ఓవర్స్ అందించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com