విశాల్ ఎంట్రీతో హీటెక్కిన ఆర్కేనగర్ బైపోల్
- December 03, 2017
తమిళనాట ఆర్కేనగర్ ఉపఎన్నిక వేడి తారాస్థాయికి చేరింది. విశాల్ ఎంట్రీతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. తొలుత అధికార, విపక్షాల మధ్య గట్టిపోటీ వుంటుందని పార్టీలు భావించినప్పటికీ.. విశాల్ రాకతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. సోమవారం ఉదయం చెన్నైలోని తన మద్దతుదారులతో కలిసి ఓ టెంపుల్‌కి వెళ్లి అక్కడ ఆశీస్సులు తీసుకుని అక్కడి నుంచి దివంగత మాజీ ముఖ్యమంత్రులైన కామరాజ్, ఎంజీఆర్, జానకీ రామచంద్రన్ విగ్రహాలను పూలమాల వేశాడు. అనంతరం ఆర్కేనగర్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నాడు.
కొన్నాళ్లగా తమిళనాట వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు నటుడు విశాల్. ఇటీవల నడిఘర్ సంఘం ఎన్నికలు.. విశాల్ రాకతో పరిస్థితి మారిపోయింది. ప్రస్తుతం తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. అక్కడ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు.
ఇదే స్పీడ్ ఆర్కేనగర్ బైపోల్లో కొనసాగిస్తాడా? రాజకీయాలు వేరు.. సినిమాలు వేరని ఓటర్లు నిరూపిస్తారో చూడాలి. ఇక విశాల్‌కి ధీటుగా బరిలోకి దిగేందుకు దర్శకుడు, నటుడు అమీర్. ఆయన కూడా స్వతంత్ర అభ్యర్థిగా సోమవారం నామినేషన్ దాఖలు వేయనున్నాడు. అధికార అన్నాడీఎంకే అభ్యర్థిగా మదుసూదనన్, డీఎంకే అభ్యర్థిగా మరుదుగణేశ్, అన్నాడీఎంకే అమ్మ (రెబల్) గా టీటీవీ దినకరన్ పోటీ చేస్తుండగా, ఇక బీజేపీ అభ్యర్థి కరు నాగరాజన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







