జీసీసీ సదస్సు కోసం మంగళవారం కొన్ని రహదారుల మూసివేత

- December 03, 2017 , by Maagulf
జీసీసీ సదస్సు కోసం మంగళవారం కొన్ని రహదారుల మూసివేత

కువైట్: 38 వ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జిసిసి) సమావేశంలో పాల్గొనేందుకు పలువురు ప్రతినిధుల రాకను పురస్కరించుకొని  కొన్ని రహదారులను రేపు మంగళవారం ( డిసెంబర్ 5 వ తేదీ ) మూసివేస్తున్నట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ఆదివారం ఒక పత్రికా ప్రకటనలో ప్రకటించింది కింగ్ ఫెయిసాల్ కు దారితీసే విమానాశ్రయ జాతీయ రహదారి , షేక్ జాయెద్ (ఐదవ రింగ్ రోడ్), మరియు ఐదవ రింగ్ రోడ్, కింగ్ ఫైసల్ హైవే మరియు ఫహహీల్ రహదారికి దారితీసే రహదారులను మధ్యాహ్నం  12:00 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మూసివేయబడతాయని అధికారులు తెలిపారు. పేర్కొన్న తేదీ మరియు సమయాలలో ట్రాఫిక్ పోలీసులతో సహకరించడానికి పౌరులు మరియు ప్రవాసీయులు మంత్రిత్వ శాఖ కోరింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com