అడ్డంగా బుక్ అయిన పేటీఎం ఫౌండర్

- December 04, 2017 , by Maagulf
అడ్డంగా బుక్ అయిన పేటీఎం ఫౌండర్

నగదు లావాదేవీల్లో డిజిటలీకరణ ఉద్యమానికి ఆదిగురువుగా చెప్పుకునే పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ.. ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాడు. అలాగని ఏదైనా దోపిడీకి, దురాగతానికీ పాల్పడలేదు. జస్ట్.. ఒక చిన్న ఓవరాక్షన్ వల్లే సోషల్ మీడియా బోనులో దోషిలా నిలబడాల్సి వచ్చిందాయన. ఇంతకీ ఆ పెద్దమనిషి చేసిన ఘనకార్యం ఏమిటంటే.. 'భారత సాయుధ దళాల ఫ్లాగ్ డే ఫండ్'కి ఇప్పుడే రూ. 501 డొనేట్ చేశా' అంటూ ఆన్ లైన్ పేమెంట్ స్క్రీన్ షాట్ తో సహా ట్వీట్ చేశాడు. సగర్వంగా ఇలా ప్రకటించుకున్నాడో లేదో అలా నెటిజన్ల నుంచి ఎదురుదాడి మొదలైంది.

భారత జవాన్లను 'గొప్ప'గా ఆదుకున్నందుకు అభినందనలు అంటూ ట్విట్టర్లో ఫాలోయర్లంతా సెటైర్లేయడం మొదలుపెట్టేశారు. ''ఢిల్లీలో 100 కోట్ల ఖరీదైన భవనంలో నివాసముంటున్న ఒక పేటీఎం పెద్దమనిషి.. భారత సాయుధ జవాన్ల సంక్షేమం కోసం రూ. 501 విరాళమిచ్చి తన పెద్ద మనసు చాటుకున్నారు'' అంటూ మొహంమీద ఉమ్మేసినంత పని జరుగుతోందక్కడ. 'పేటీఎం కరో' అనేది ఆయన సొంత బ్రాండ్ స్లోగన్.

దీన్ని ప్రమోట్ చేసుకోడానికి పెట్టిన ఒకేఒక్క ట్వీట్.. ఆయన్ను తీసుకొచ్చి ఇలా బజార్న పడేసింది. జనంలో స్ఫూర్తి నింపడంతో పాటు సొంత కంపెనీ ప్రమోషన్ కూడా జరిగినట్లవుతుందని ఆశపడ్డందుకు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మకు బాగానే అయ్యింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com