గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- September 17, 2025
రియాద్: గాజాలో జరిగిన మారణహోమ నేరాలకు ఇజ్రాయెల్‌ను తప్పబట్టింది ఐక్యరాజ్యసమితి స్వతంత్ర అంతర్జాతీయ విచారణ కమిషన్. ఈ కమిషన్ జారీ చేసిన నివేదికలోని ఫలితాలను సౌదీ అరేబియా స్వాగతించింది. గాజా స్ట్రిప్‌లో నిరాయుధ పౌరులపై ఇజ్రాయెల్ సాయుధ దళాలు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ మారణహోమ నేరాలకు పాల్పడుతున్నట్లు నివేదికలో వెల్లడించారు.
కాగా, ఈ నివేదిక పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న నేరాలు, ఉల్లంఘనలను స్పష్టంగా ప్రపంచ దేశాలకు తెలియజేస్తున్నాయని సౌదీ అరేబియా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయ తీర్మానాలను అమలు చేయడానికి, రెండు దేశాల ఏర్పాటుతో పరిష్కారాన్ని అమలు చేయడానికి మరియు పాలస్తీనా ప్రజల కష్టాలను దూరం చేసేందుకు శాశ్వతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజానికి సౌదీ అరేబియా మరోసారి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము, అమిత్ షా, రాహుల్ గాంధీ
- యూఏఈలో అక్టోబర్ నుంచి అధిక వర్షాలు?
- సౌదీ అరేబియాలో వడ్డీ రేట్లు పెంపు..!!
- హోర్ముజ్ జలసంధి పరిస్థితిపై ఒమన్ కీలక ప్రకటన..!!
- కువైట్‌లో డ్రోన్లపై మరోసారి హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్‌లో ఆలీ వాక్‌వేకు కొత్త రూపు..!!
- ఖతార్‌లో కీలక వడ్డీ రేట్లు పెంపు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్స్ విక్రయ తేదీలు వెల్లడి
- TGSRTC సంచలన నిర్ణయం..
- ఎయిర్ ఇండియా, ఉజ్బెకిస్థాన్ ఎయిర్‌వేస్‌తో ఫ్లైడుబాయ్ కొత్త భాగస్వామ్యాలు







