" అజ్ఞాతవాసి " మిస్ అవుతున్న సీనియర్ నటి ఖుష్బూ
- December 04, 2017
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం " అజ్ఞాతవాసి " లో తన రోల్ కు సంబంధించిన షూటింగ్ పూర్తయిందని అన్నారు సీనియర్ నటి ఖుష్బూ. యూనిట్ సభ్యులను విడిచివెళ్ళడం బాధగా ఉందంటూ..దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి దిగిన సెల్ఫీని ఆమె ట్విటర్ లో పోస్ట్ చేశారు. కొందరిని విడిచి వెళ్తూ గుడ్ బై చెప్పాలంటే బాధగా ఉంటుంది. అలాంటివారే ఈ మూవీ సభ్యులు. నా చివరి షూటింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్నా. ఇంత మంచివారికి వీడ్కోలు చెప్పి వెళ్తుంటే నా కళ్ళు చెమర్చాయి. ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని కోరుతున్నా అని ఖుష్బూ ట్వీట్ చేశారు. ప్రత్యేకంగా త్రివిక్రమ్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని, అలాగే.. సహ నటుడు పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలని ఆమె పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతి పండుగకు ఈ చిత్రం విడుదల కానుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల