జట్టులో యువీ లేకపోవటంతో ఆగ్రహానికి గురైన అభిమానులు
- December 05, 2017
దిల్లీ: శ్రీలంకతో టీ20, దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ల కోసం బీసీసీఐ సోమవారం సాయంత్రం జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. యో యో టెస్టు పాసైన యువీ తిరిగి జట్టులో స్థానం దక్కించుకుంటాడని యూవీ అభిమానులు ఆశపడ్డారు. కానీ, సెలక్టర్లు అతనివైపు మొగ్గు చూపలేదు. దీంతో అభిమానులు నిరుత్సాహానికి గురయ్యారు.
దీంతో నెటిజన్లు ఇప్పటి వరకు యో యో టెస్టు పాసవ్వలేదని యువీని జట్టులోకి తీసుకోలేపోయం అని చెప్పిన సెలక్టర్లు ఇప్పుడు ఎందుకు ఎంపిక చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తాజాగా బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ మాట్లాడుతూ... 'ఇటీవల కాలంలో యువరాజ్ ఫిట్నెస్ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాదు యో యో టెస్టు పాసైన అనంతరం అతడు ఎలాంటి క్రికెట్ ఆడలేదు. ఏదైనా టోర్నీలో ఆడి ఉంటే ఎలా ఆడుతున్నాడన్న దానిపై ఓ అంచనాకి వచ్చేవాళ్లం. కానీ అతడు ఎలాంటి టోర్నీ ఆడలేదు. అందుకే ఎంపిక చేయలేదు' అని ప్రసాద్ వివరించారు.
2019 ప్రపంచకప్ వరకు క్రికెట్ ఆడాలనుకుంటున్నానని, ఏ ఫార్మాట్లో ఆడతానో తెలియదని, ఆ తర్వాత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకుంటా అని యువీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!