ఆకట్టుకున్న నేవీ డే వేడుకులు
- December 05, 2017
భారీ పేలుళ్లు.. బాంబుల మోతలు.. బుల్లెట్ల శబ్ధాలు.. అరుపులు.. కేకలు.. వేగంగా దూసుకుపోయే యుద్ధ విమానాలు.. శత్రు సైన్యంపై మెరుపు దాడులు.. రయ్ మని దూసుకుపోయే జెమినీ బోట్లు.. ప్రత్యర్థిని తికమక పెడుతూ వేసే ఎత్తుకు పై ఎత్తులు.. వేగంగా వెళ్తున్న విమానం నుంచి సాహసోపేతంగా చేసే స్కై డైవింగ్.. మరోవైపు ఉవ్వెత్తున ఎగసి పడుతున్న సముద్రపు అలలు.. ఏంటి యుద్ధం ఎక్కడ జరుగుతోంది అనుకుంటున్నారా? ఈ విన్యాసాలన్నీ విశాఖలో సాగాయి..
విశాఖ సాగర తీరంలో యుద్ధ విన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రతీ ఏడాది డిసెంబర్ 4వ తేదీన నిర్వహించే నేవీ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సాగర తీరంలో యుద్ధ వాతావరణాన్ని సృష్టించినట్టు విన్యాసాలు కనిపించాయి. యుద్ధం సమయంలో మెరుపు వేగంతో ఎలా స్పందిస్తారు.. శత్రు సేనలతో ఎలా తలపడతారు. ఎలాంటి ఆయుధాలతో తలపడతారు.. లాంటి అంశాలను కల్లకు కట్టినట్టు చూపించారు. నేవీ డే విన్యాసాలను తిలకించేందుకు నగరవాసులు వేల సంఖ్యలో హాజరయ్యారు..
ముఖ్యంగా సముద్రం మధ్యలో చేసిన ఆయిల్ రిగ్ బ్లాస్టింగ్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. స్కై డ్రైవర్స్ చేసిన త్రివర్ణ పతాక ప్రదర్శన ఆకట్టుకుంది. ఆకాశంలోంచి మెరుపు వేగంగా చేసిన స్కై డైవింగ్ థ్రిల్ న కల్పించింది. ఈస్ట్రన్ నేవల్ కమాండెంట్ చీఫ్ కరమ్ బీర్ సింగ్, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, భూమా అఖిళ ప్రియ తదితరలు వేడుకలను ప్రత్యకంగా తిలకించారు.
తాజా వార్తలు
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్‌మ్యాప్‌ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!
- వీడియో వైరల్.. కార్ అద్దె కంపెనీ సిబ్బంది అరెస్టు..!!
- బిగ్ టికెట్ వీక్లీ డ్రాలో విజేతలుగా నలుగురు భారతీయులు..!!
- కువైట్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం.. ట్రాఫిక్ సమస్యలపై సమీక్ష..!!
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్‌లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!