ఉగ్ర పోరు కొనసాగుతుంది: ఆర్మీ చీఫ్
- December 05, 2017
సూరత్‌గఢ్(రాజస్థాన్): కశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని నిర్మూలించే చర్యలు కొనసాగుతూనే ఉంటాయని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పష్టంచేశారు. రాజస్థాన్‌లోని సూరత్‌గఢ్ మిలటరీ స్టేషన్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులను ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి మెరుగుపడిందన్నారు. భవిష్యత్‌లోనూ ఈ ఆపరేషన్ కొనసాగుతుందన్నారు.
ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో మొత్తం 200 మంది ఉగ్రవాదులను ఏరివేసినట్లు చెప్పారు. 2010 తర్వాత ఒకే సంవత్సరంలో ఇంతమంది మట్టుబెట్టడం ఇదే తొలిసారి తెలిపారు. పొరుగుదేశం ఉగ్ర సంస్థలతో కుమ్మక్కవుతుందని పాక్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. భారత్ మాత్రం ఎప్పటికీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉంటుందని స్పష్టంచేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







