టీవీల్లో కండోమ్ వాణిజ్య ప్రకటనలకు రాత్రివేళల్లోనే అనుమతి
- December 05, 2017
న్యూఢిల్లీ : ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో టీవీల్లో కండోమ్ లపై వాణిజ్య ప్రకటనలను రాత్రివేళల్లోనే అనుమతించాలని అడ్వైర్టైజింగ్ స్టాండర్స్డ్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఏఎస్సీఐ) సంచలన సూచన చేసింది. రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరుగంటల లోపు సమయంలోనే టీవీల్లో కండోమ్ వాణిజ్య ప్రకటనలు వేయాలని ఏఎస్సీఐ సూచించింది. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో టీవీల్లో కండోమ్ వాణిజ్యప్రకటనలు రాత్రివేళ పెద్దలు మాత్రమే చూసేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వశాఖ ఏఎస్సీఐకి సూచించింది. కండోమ్ పై టీవీల్లో వస్తున్న వాణిజ్య ప్రకటనలపై మహారాష్ట్ర మహిళా కమిషన్ సమీక్షించి విషయాన్ని ఏఎస్సీఐ దృష్టికి తెచ్చింది. సన్నీలియోన్ కండోమ్ వాణిజ్య ప్రకటన గురించి మహారాష్ట్ర మహిళా కమిషన్ ప్రకటనల విభాగం యొక్క సుప్రీం స్వీయ-నియంత్రణ సంస్థ అయిన ఏఎస్సీఐ కు ఫిర్యాదు చేసింది. కండోమ్ ప్రకటనలు రాత్రివేళల్లో మాత్రమే ప్రసారమయ్యేలా చూడాలని అన్ని టెలివిజన్ చానెళ్లకు తాము సలహా ఇస్తామని ఏఎస్సీఐ పేర్కొంది. వాణిజ్య ప్రకటనల్లో ముఖ్యంగా మహిళల చిత్రణలో అసభ్యత, అశ్లీలత లేకుండా చూడాలని సూచించింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!