ప్రపంచ ఆలోచనాపరుల జాబితాలో అగ్రస్థానం లో నిలిచిన కమలా హ్యారిస్
- December 05, 2017
వాషింగ్టన్: 'ప్రపంచ అత్యుత్తమ ఆలోచనాపరుల జాబితా'లో.. భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ అగ్రస్థానం సాధించారు. ప్రఖ్యాత 'ఫారిన్ పాలసీ' మ్యాగజైన్ 2017కు గానూ 50 మంది పేర్లతో కూడిన ఈ జాబితాను ప్రకటించింది. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పాలన సాగుతున్న సమయంలో.. ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీకి కమలా ఆశాజ్యోతిగా నిలిచారంటూ మ్యాగజైన్ వర్ణించింది. ప్రస్తుతం కమలా కాలిఫోర్నియా రాష్ట్రానికి సెనేటర్‌గా ఉన్నారు. ఇటు భారత సంతతికి చెందిన హాస్యకారుడు హసన్ మిన్హాజ్, రాజకీయ నాయకురాలు నిక్కీ హేలీలు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించారు. హసన్‌కు జాబితాలో మూడో స్థానం దక్కింది.
అంతర్జాతీయ వ్యవహారాల పట్ల అమెరికా సంప్రదాయ దార్శనికతను హేలీ కాపాడుతున్నారని 'ఫారిన్ పాలసీ' కొనియాడింది. ఐరాసకు అమెరికా రాయబారిగా నియమితురాలైన హేలీ.. అధ్యక్ష కేబినెట్‌లో సభ్యత్వం దక్కించుకున్న తొలి భారతీయ అమెరికన్‌గా ఘనత సాధించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







