భారత న్యాయశాస్త్రంలో ఏకంగా 129 చట్టాలు రద్దు

- December 05, 2017 , by Maagulf
భారత న్యాయశాస్త్రంలో ఏకంగా 129 చట్టాలు రద్దు

రాష్ట్రంలో 21 శాఖల్లో 129 చట్టాల్ని రద్దు చేయాలని గుర్తించారు. రాష్ట్రంలో ఇరకా కొన్ని చట్టాలు చట్టుబండలుగానే కనిపిస్తున్నాయి. కాలర చెల్లిపోయినప్పటికీ, ఇరకా రికార్డు పుటల్లో దర్శనమిస్తున్నాయి. వీటిల్లో అనేక చట్టాలకు పదుల సంఖ్యలో సవరణలు చేసినప్పటికీ, పాత వాటిని రద్దు చేయకపోవడంతో ఒకే రంగానికి అనేక చట్టాలు ఉన్న పరిస్థితి నెలకొరది. ఇటువంటి వాటిలో అనేక చట్టాలు స్వాతంత్య్రం రాకమురదు బ్రిటిష్‌ కాలంలో ఉరడగా, వాటిల్లో కొన్ని 19వ శతాబ్దంలోనివి కూడా ఉరడడం విశేషం. అరదుకే వాటిని ఎలాగైనా రద్దు చేయాలన్న నిర్ణయానికొచ్చిన ప్రభుత్వం కీలక కసరత్తు పూర్తి చేసిరది. మొత్తం 491 చట్టాలు రాష్ట్రంలో ఉరడగా, వాటిల్లో కాలం తీరిన ఈ చట్టాలు కూడా ఉన్నట్లు నిర్ధారిరచారు. రద్దు చేయాల్సిన 129 చట్టాల్లో 1900 సంవత్సరం నురచి స్వాతంత్య్రం వచ్చిన 1947 మధ్య కాలంలో ఉన్న చట్టాలే 37 ఉన్నాయి. వాటిల్లో వ్యవసాయదారుల రుణ చట్టం, వ్యవసాయ రిలీఫ్‌ చట్టం, మత్స్యకారుల చట్టం, ఆరధ్రా ప్రారత వికేంద్రీకరణ చట్టం, నీటిపారుదల వాలంటరీ సెస్‌ చట్టం, హాక్నీ క్యారేజ్‌ చట్టం, ఇరపార్టిబుల్‌ చట్టంతోపాటు 1934లో బ్రిటిష్‌ హయారలోనే రూపొరదిరచిన రుణగ్రస్తుల రక్షణ చట్టం కూడా ఉన్నాయి. అలాగే ఎస్టేట్‌ ల్యారడ్‌ చట్టం, కరవు సహాయ చట్టం, మీర్జాపురం, పొడగొన్నూరు ఎస్టేట్‌ చట్టం, నంబూద్రి చట్టం, వడ్డీ రుణాల చట్టం వంటివి కీలకంగా ఉన్నాయి. ఆరధ్రా ప్రారత పోర్టు చట్టం కూడా రద్దు చేయాల్సిన చట్టాల జాబితాలో ఉంది. 

ఇక 19వ శతాబ్దంలో తయారు చేసిన అనేక చట్టాలు కూడా ఇప్పటికీ ఉన్నాయి. ఇవి ఆచరణలో లేకపోయినప్పటికీ, రికార్డులకు భారంగా ఉన్నాయి. వాటిల్లో అత్యరత పురాతనమైన చట్టంగా 1802లో ఆమోదిరచిన ఆరధ్రా ప్రారత పాలన-ఎస్టేట్‌ నియంత్రణ చట్టం కూడా ఉరది. అదే ఏడాదిలో ఇరడియన్‌ సివిల్‌ సర్వీస్‌ రుణ నిషేధ చట్టం చేశారు. వాటిని కూడా తాజాగా రద్దు చేయాల్సి ఉరది. అలాగే 1803లో కలెక్టర్ల నియంత్రణ చట్టం, రెవెన్యూ రెగ్యులేషన్‌ బోర్డు చట్టం వంటివి ఉన్నాయి. ఆ తరువాత కాలంలో కూడా 1866లో పశువుల వ్యాధి చట్టం, 1867లో జనరల్‌ క్లాజెస్‌ చట్టం, 1878లో తయారుచేసిన మున్సిపల్‌ పోలీసు చట్టం, 1888లోని గ్రామీణ న్యాయస్థానాల చట్టం, 1865లోని నీటిపారుదల సెస్‌ చట్టం, 1958లో తయారుచేసిన తప్పనిసరి కార్మిక చట్టం, 1883లోని సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ లోకల్‌ స్వయం ఉపాధి చట్టం, 1816లోని గ్రామీణ భూ వివాదాల క్రమబద్ధీకరణ చట్టం, 1898లోని సెంట్రల్‌ ప్రావిన్సెస్‌ అద్దె చట్టం, 1862, 1866, 1869 సంవత్సరాల్లో తయారుచేసిన ఇనాం చట్టాలు, 1837లో తయారుచేసిన ప్రజా ఆస్తుల నమ్మకద్రోహం చట్టం, 1849లోని రెవెన్యూ కమిషనర్‌ చట్టం, 1817లోని రెవెన్యూ రికవరీ (మిలటరీ ఆస్తులు) చట్టం, 1830లో సతి నియంత్రణ చట్టం కూడా ప్రముఖంగా ఉన్నాయి. అప్పట్లోని ఈ చట్టాలు పనికిరానివిగా గుర్తిరచినప్పటికీ, తాజా పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా మార్పులతో అమలు చేయాల్సినవికూడా కొన్ని ఉరటాయని సీనియర్‌ అధికారులు అరటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com