జోస్యంతో పాక్ ను హడలెత్తిస్తున్న భారతీయుడు
- December 05, 2017
దిల్లీ: పాకిస్థాన్లో ఫలానా సమయంలో దాడులు జరుగుతాయంటూ ఓ జ్యోతిష్కుడు చేసిన ట్వీట్లకు.. ఆ దేశ ఎంపీలు బెంబేలెత్తుతున్నారు. ఇదే సాకుగా తమ దేశంలో జరుగుతున్న దాడుల వెనుక భారత్ హస్తముందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అనిరుధ్కుమార్ మిశ్ర అనే పేరుతో ఓ వ్యక్తి ట్విటర్లో జోస్యాలు చెబుతున్నారు. విపత్తులు, ఎన్నికలు, స్టాక్మార్కెట్లు, ఉగ్రదాడులు సహా వివిధ అంశాలకు సంబంధించిన పరిణామాలపై ముందుగానే అంచనాలు వేస్తున్నారు. నవంబర్లో పాక్లో ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తూ అక్టోబర్లోనే ఆయన ట్వీట్చేశారు. అయితే డిసెంబర్ 1న పెషావర్లో ఉగ్రవాదులు దాడి చేసి 13మందిని బలితీసుకున్నారు. దీంతో ఘటనపై ఓ భారతీయుడు అటూఇటుగా అంచనా వేయగలిగాడని.. ఇదెలా సాధ్యమైందని పాక్ అంతర్గతమంత్రిని ఆ దేశ ఎంపీలు వివరణ కోరారు. ఇటు ఫిబ్రవరి ముగిసేలోపు పాక్లో ఐదు దాడులు జరుగుతాయంటూ అనిరుధ్కుమార్ ఇంకో ట్వీట్చేయడం గమనార్హం.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







