తెలంగాణలో డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీకి రెడీ

- November 15, 2015 , by Maagulf
తెలంగాణలో డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీకి రెడీ

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డ‌బుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీకి రెడీ అయ్యాయి. సికింద్రాబాద్ ఐడిహెచ్ కాలనీలో జి ప్లస్ 2 మోడల్ లో 396ఇళ్లను నిర్మించింది. 33 బ్లాకుల్లో నిర్మించిన ఈ ఇళ్లకు మొత్తం 43కోట్లు ఖర్చు అయ్యింది. ఆరెకరాల పది గుంటల స్థలంలో వీటిని నిర్మించారు. నాణ్యతా ప్రమాణాల్లో రాజీ పడకుండా అత్యంత ఆధునిక హంగులతో ఐడీహెచ్‌ కాలనీ ఇళ్లను నిర్మించారు. ఫంక్షన్ల కోసం కమ్యూనిటీ హాల్‌ నిర్మాణంలో ఉంది. 580 చ‌ద‌ర‌పు అడుగుల స్థలంలో డబుట్ బెడ్ రూం ఇల్లు ఇక్కడ నిర్మించిన ఒక్కో ఇంట్లో.. విశాల‌మైన హాలు రెండు బెడ్ రూంలు, ఒక‌ కిచెన్, రెండు టాయిలెట్స్ ఉన్నాయి. ఇందులో ఒక‌టి వెస్ట్రన్‌ టాయిలెట్ కావ‌డం విశేషం. మొత్తం 580 చ‌ద‌ర‌పు అడుగుల స్థలంలో ఈ ఇళ్లని నిర్మించారు. ప్రతి యూనిట్ కు 10లక్షల రూపాయలకు పైగా ఖర్చు అయ్యింది. నిర్మాణ ఖర్చునంతా ప్రభుత్వమే భరించింది. శిథిలావస్థకు చేరుకున్న తమ ఇళ్ల స్థానంలో ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించి ఇవ్వడంపై స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన ఇళ్ల పరిశీలన ఐడీహెచ్‌ కాలనీలో నిర్మించిన ఇళ్లను పరిశీలించిన పలువురు ప్రముఖులు, ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పధకాన్ని ప్రశంసించారు. ఈ కాలనీలో నిర్మించిన 396 ఇళ్లలో 276 షెడ్యూల్డు కులాల లబ్ధిదారులకు కేటాయించారు. 31 ఇళ్లను ఎస్టీలకు ఇస్తున్నారు. 79 ఇళ్లను బలహీన వర్గాలకు కేటాయించారు. మిగిలిన ఇళ్లను మైనారిటీలు, ఇతరులకు ఇస్తున్నారు. ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చామని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. సంతోషం వ్యక్తం చేసిన లబ్ధిదారుల 2014 అక్టోబర్ లో ఇళ్ల నిర్మాణం ప్రారంభించిన ప్రభుత్వం 6 నెలల్లో ఇళ్లను హ్యాండోవర్ చేస్తామంది. వివిధ కారణాల వల్ల ఆలస్యమైనప్పటికి 13 నెలల్లో ఇళ్లనిర్మాణం పూర్తి చెయ్యడంపై లబ్ధిదారుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అనుభవంతో ఇక ముందు హైదరాబాద్ లో 9 అంతస్తుల్లో ఇళ్లనిర్మాణానికి అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com