వేసవి కి రెడీ అంటున్న 'కాంచన 3'
- December 06, 2017
'ముని' చిత్రంతో హర్రర్ బాటలో అడుగుపెట్టిన రాఘవ లారెన్స్ ప్రస్తుతం వరుస హిట్లతో విజృంభిస్తున్నారు. ఆ సినిమాకు సీక్వెల్‌గా ఇప్పటి వరకు మూడు సినిమాలు విడుదలై మంచి విజయాలను అందుకున్నారు. రెండో సీక్వెల్ 'కాంచన'గా, ఆ తర్వాత చిత్రం 'కాంచన 2'గా వచ్చింది. ఇప్పుడు 'కాంచన 3' తెరకెక్కుతోంది. దీన్నే 'ముని 4'గా కూడా చిత్రవర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఓవియా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. అయితే కొన్ని కారణాలతో ఓవియా ఈ సినిమా నుంచి తప్పుకుందని వార్తలు వినిపించాయి. అందులో ఎలాంటి నిజం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం లారెన్స్, ఓవియాకు సంబంధించిన సన్నివేశాలను తెరకెక్కించామని పేర్కొంటున్నాయి. 'బిగ్‌బాస్' కార్యక్రమంతో గుర్తింపు తెచ్చుకున్న ఓవియాకు ఈ సినిమా మరో బ్రేక్ ఇస్తుందని సంబంధిత వర్గాలు అంటున్నాయి. వేసవిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో తెరకెక్కుతోంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల