చైనాలోకి భారత డ్రోన్
- December 06, 2017
భారత్‌కు చెందిన ఒక డ్రోన్ తమ గగనతలంలోకి వచ్చిందని చైనా ఆరోపిస్తోంది. అయితే ఆ డ్రోన్ కూలిపోయినట్లు తెలిపింది. ఈ మేరకు చైనా అధికారిక మీడియా పేర్కొంది. 'చైనా ప్రాదేశిక సౌర్వభౌమత్వాన్ని ఉల్లంఘించేలా భారత్ చర్య ఉంది. దీనిపై మేం తీవ్ర అసహనం, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం' అని చైనా ఆర్మీ డిప్యూటీ డైరెక్టర్ జాంగ్ షౌలీ మీడియాతో అన్నారు. అయితే డ్రోన్ ఎక్కడికి, ఎప్పుడు వచ్చిందనే విషయాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. చైనా సరిహద్దు దళాలు డ్రోన్‌ను గుర్తించినట్లు పేర్కొన్నారు. అయితే దీనిపై భారత అధికారుల నుంచి ఇంకా స్పందన రాలేదు. కాగా కొద్ది నెలల క్రితం భారత్-చైనా మధ్య డోక్లాం వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. భారత భద్రతకు భంగం కలిగేలా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టిందని మన దేశం ఆరోపించింది. భారత సైన్యం దాన్ని అడ్డుకోవడంతో చైనా మండిపడింది. భారత సైన్యం వెనక్కి వెళ్లిపోవాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పలు మార్లు హెచ్చరించింది. దాదాపు రెండున్నర నెలల ఉద్రిక్తత తర్వాత ఆగస్టులో డోక్లాం వివాదం సద్దుమణిగింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







