అల్ బతినా ఎక్స్‌ప్రెస్ వేపై ప్రముఖ భాగం ప్రారంభం
- December 07, 2017
మస్కట్: అల్ బతినా ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్ట్‌కి సంబంధించి కీలకమైన భాగాన్ని మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ కూమ్యనికేషన్స్ ఈ రోజు ఉదయం ప్రారంభించింది. దీంతో 17 కిలోమీటర్ల పొడవైన మార్గం తాజాగా వాహనాల రాకపోకల కోసం అందుబాటులోకి వచ్చింది. సౌత్ బతినా గవర్నరేట్ పరిధిలోని అల్ రుస్తాక్ విలాయత్‌లో గల అల్ హజ్మ్ నుంచి నార్త్ బతినా ప్రావిన్స్‌లోని అల్ సువైక్ గవర్నరేట్‌కి రీచ్ అయ్యేలా ఈ మార్గాన్ని ఏర్పాటు చేశారు. మస్కట్ ఎక్స్‌ప్రెస్‌వే చివరి నుంచి ప్రారంభమయి, విలాయత్ షానాస్లోని ఖత్మత్ వరకు బతినా ఎక్స్‌ప్రెస్‌వేని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 272 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్ట్‌ని రూపొందించారు. ప్రాజెక్ట్‌లో భాగంగా పలు ఇంటర్సెక్షన్స్ ట్రాఫిక్ అవసరాల నేపథ్యంలో ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్‌లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







