కారులో మృతి చెందిన వ్యక్తి
- December 07, 2017
మనామా: ఓ వ్యక్తి కారులో మృతి చెందిన ఘటన బిలాద్ అల్ కదీమ్లోని ఓ మాస్క్ సమీపంలో చోటు చేసుకుంది. మృతుడు కారుని, మసీదు పక్కనే పార్క్ చేసినట్లు సీసీటీవీ విజువల్స్‌లో తేటతెల్లమవుతోంది. కారులో వ్యక్తిని గుర్తించిన కొందరు, పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు వచ్చి చూసేసరికి అతను మృతి చెంది ఉన్నాడు. కారు ఇంజిన్ అప్పటికీ రన్నింగ్ కండిషన్లో ఉందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నలభయ్యేళ్ళ వ్యక్తి కారులో ఉండి, లాక్ చేసుకున్నట్లు ఓ ప్రత్యక్ష సాక్షి వివరించారు. మృతుడ్ని రెస్టారెంట్ ఓనర్ ఒకరు ముందుగా గుర్తించడం జరిగింది. రాత్రి 9.58 నిమిషాల సమయంలో కారు అక్కడ ఆగిందనీ, ఉదయం వరకూ కారు అక్కడే ఉండిపోయిందని రెస్టారెంట్ ఓనర్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







