మహిళల్ని కెమెరాలో చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదు

- December 07, 2017 , by Maagulf
మహిళల్ని కెమెరాలో చిత్రీకరించిన వ్యక్తిపై కేసు నమోదు

గల్ఫ్‌ జాతీయుడైన యువకుడొకరు, తన కెమెరాలో మహిళల్ని చిత్రీకరించి ఆ విజువల్స్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన సంఘటన వెలుగు చూసింది. బాధిత మహిళ, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ రస్‌ అల్‌ ఖమా మిస్‌డెమీనర్‌ కోర్టులో జరుగుతోంది. బాధిత మహిళల అనుమతి లేకుండా వారిని కెమెరాలో చిత్రీకరించినట్లు న్యాయస్థానానికి తెలిపారు పోలీసులు. అయితే తన మీద వచ్చిన ఆరోపణల్ని నిందితుడు అంగీకరించడంలేదు. ఆ ఇద్దరు మహిళలూ తనకు తెలుసనీ, వారి అనుమతితోనే వారిని వీడియో తీయడం జరిగిందని నిందితుడు అంటున్నాడు. సోషల్‌ మీడియాలో వీడియోను ఓ మహిళ భర్త చూడటం, ఆమెపై ఆ భర్త ఆగ్రహానికి గురవడంతో, ఆమె పోలీసులను ఆశ్రయించి, తనపై అక్రమంగా కేసు బనాయించినట్లు నిందితుడు విచారణలో పోలీసులకు తెలిపినట్లు సమాచారమ్‌. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com