సౌదీ యజమాని పనిమనిషిపై అత్యాచారయత్నం.. వీడియో వైరల్
- December 08, 2017రియాధ్: ఉపాధి కోసం గృహ సేవకురాలిగా సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ ఫిలిప్పీన్ మహిళ తన యజమానిటీ ద్వారా లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు సామాజిక మాధ్యమాలలో ఓ వీడియో వైరల్ కాబడి స్థానికంగా సంచలనం కల్గిస్తుంది. ఏజెంట్ల మాయ మాటలు నమ్మి ఓ ఇంట్లో పనిమనిషిగా చేరేందుకు సౌదీకి వెళ్లిన ఆమెపై అత్యాచారయత్నానికి ఒడిగట్టాడో సౌదీ యజమాని. ఆ దృశ్యాలు అనుకోకుండా బయటపడటంతో ఆగ్రహించి ఆమెను తన ఇంట్లో బంధించాడు. ఫిలిప్పీన్‌కు చెందిన బెత్ లిలీ.. బతుకుదెరువు కోసం సౌదీకి వచ్చింది. ఊహించని రీతిలో యజమాని తనపై అత్యాచారయత్నం చేస్తుండగా తీవ్రంగా ప్రతిఘటించింది. కత్తి తీసుకుని ఆ దుర్మార్గుడిని బెదిరించింది. దీంతో అక్కడి నుంచి యజమాని వెళ్లిపోయాడు. ఈ ఘటనను గుర్తు తెలియని వ్యక్తి రహస్యంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా వైరల్ అవడంతో ఆమెపై ఆగ్రహించి ఇంట్లో బంధించాడు. కాళ్లు కట్టేసి గదిలో బంధించాడు. తన పరిస్థితిని వివరిస్తూ.. తన ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేసిందామె. గట్టిగా మాట్లాడితే బయట ఉన్న యజమానికి వినిపిస్తుందనే భయంతో చిన్నగా మాట్లాడుతూ తన పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చెప్పింది. ఎవరైనా తనను రక్షించాలని కోరింది. తనకు ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదని పశ్చాత్తాపపడుతుంది...ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరైనా ముందుగా చెప్పి ఉంటే అసలు సౌదీ రాకపోయేదానినని . తాను మళ్లీ ఫిలిప్పీన్ వెళ్లిపోతాననీ, అక్కడే ఏదో ఒక పనిచేసుకుని బతుకుతానని కన్నీరుమున్నీరవుతుంది.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్