బహ్రెయిన్‌లో కొరియా ఫిలిం ఫెస్టివల్ ప్రారంభం
- December 08, 2017
మనామా: నాలుగవ ఎడిషన్ కొరియన్ ఫిలిం ఫెస్టివల్ 'కొరియన్ మూవీ వీక్స్ 2017' సీఫ్ మాల్లో ప్రారంభమయ్యింది. మనామాలోని కొరియన్ ఎంబసీ, మూవీ లవర్స్‌ని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానిస్తోంది. కొరియా ఫౌండేషన్ మరియు కోబిజ్తో కలిసి ఈ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నారు. కొరియన్ అంబాసిడర్ కూ హ్యున్ మో మాట్లాడుతూ స్టూడెంట్స్, ఫ్యామిలీస్, డిప్లామాట్స్ని ఈ ఫెస్టివల్‌కి ఆహ్వానిస్తున్నామనీ, కొరియన్ కల్చర్ అలాగే మూవీస్ గురించి ఇక్కడ అవగాహన లభిస్తుందని అన్నారు. కొరియన్ స్నాక్ కింబాప్ని ఆహతులకు అందజేయనున్నట్లు చెప్పారు. ఈ డిసెంబర్లో ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు సినిమా ప్రదర్శనలు ఉంటాయి. 2018 పోంగ్చాంగ్ వింటర్ ఒలింపిక్ గేమ్స్‌కి ట్రిబ్యూట్‌గా తొలి సినిమాని ప్రదర్శిస్తున్నారు. వాస్తవ సంఘటన ఆధారంగా 'టేక్ ఆఫ్'ని ప్రదర్శించనుండడం గమనించదగ్గ విషయం. 2009లో ఈ చిత్రం బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అవార్డ్ దక్కించుకుంది. వచ్చేవారం బెర్లిన్ ఫైల్ సినిమాని ప్రదర్శిస్తారు. ఇదొక థ్రిల్లర్ మూవీ. డిసెంబర్ 20, 27 తేదీల్లో 'ది ఫాటల్ ఎన్కౌంటర్', '200 పౌండ్స్ బ్యూటీ' చిత్రాల్ని ప్రదర్శిస్తారు. ఈ సినిమాలకు ప్రవేశం ఉచితం.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







