గేమింగ్‌లో పెట్టుబడులతో రండి: కేటీఆర్
- December 09, 2017
హైదరాబాద్: కంప్యూటర్ గేమ్స్, యానిమేషన్ రంగం వల్ల ప్రపంచవ్యాప్తంగా సుమారు 240 బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుంటే.. మన దేశంలో కేవలం 2 బిలియన్ డాలర్ల లోపే ఉందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి చేస్తే యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలిపారు. గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో గేమర్ కనెక్ట్ ప్రదర్శనను ఏర్పాటుచేశారు. వీడియో గేమ్‌లు, మల్టీమీడియా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, దీనికి అవసరమైన మౌలిక వసతులు కల్పించామన్నారు. ప్రైవేటు కంపెనీలు పెట్టుబడులతో ముందుకు రావాలని కోరారు. ఎన్ వీడియో ఏర్పాటుచేసిన ప్రదర్శనలో వీడియో గేమ్‌లను ఆడి అక్కడ ఉన్నవారిని కేటీఆర్ ఉత్సాహపరిచారు.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







