భారత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న చైనా మీడియా

- December 09, 2017 , by Maagulf
భారత్ క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న చైనా మీడియా

చైనా భూభాగంలోకి అక్రమంగా డ్రోన్‌ను ప్రవేశపెట్టినందుకు భారత్ క్షమాపణలు చెప్పాలని చైనా మీడియా కోరుతోంది. చైనాలోకి అక్రమంగా ప్రవేశించిన భారత డ్రోన్‌ను కూల్చేసినట్టు చైనా ఆర్మీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్‌ను భారత్ కావాలనే వివాదాస్పద డోక్లాం ప్రాంతానికి పంపించిందని చైనా ఆరోపిస్తోంది.
ఈ నేపథ్యంలో చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' ఓ కథనాన్ని ప్రచురించింది. గతంలో సిక్కిం సెక్టార్‌లోని డోక్లాం ప్రాంతంలో చైనా, భారత్ మధ్య రహదారి విషయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతంలోకి భారత్ మానవ రహిత డ్రోన్‌ను పంపించింది. చాలా సున్నితమైన ఆ ప్రాంతంలో రెచ్చగొట్టే చర్యలకు దిగకూడదని ఇరు దేశాలూ గతంలోనే ఒప్పందాలు చేసుకున్నాయి. అయితే భారత్ ఆ ఒప్పందాలను ఉల్లంఘించింది. ఇందుకు భారత్ క్షమాపణలు చెప్పాల్సిందేనని 'గ్లోబల్ టైమ్స్' రాసింది. సాంకేతిక సమస్య కారణంగానే డ్రోన్ అక్కడకు వచ్చిందని భారత్ చెబుతుండడం పూర్తిగా అబద్ధమని ఆరోపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com