కాల్చేశాడు...కోపమే కారణం
- December 09, 2017
రాయిపూర్: ఛత్తీస్‌గఢ్‌లో సీఆర్పీ ఎఫ్ జవాను జరిపిన కాల్పుల్లో అదే విభాగానికి చెందిన నలుగురు జవాన్లు మృతి చెందారు. ఈ సంఘటన శనివారం సాయంత్రం బస్తర్ ప్రాంతం బీజాపూర్‌లోని బసగూడ సీఆర్పీఎఫ్ 168 బెటాలియన్ క్యాంప్‌లో జరిగినట్టు ఆ ప్రాంత ఐజీ వివేకానందసిన్హా తెలిపారు. తన సీనియర్ సహచరులతో గొడవ పడి జవాను ఈ ఘటనకు పాల్పడినట్టు ఆయన తెలిపారు. ఆ ప్రాంత ఎస్పీతోపాటు సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షి స్తున్నట్టు ఆయన చెప్పారు. మృతుల్లో ఇద్దరు సబ్- ఇన్స్పెక్టర్లు, ఓ అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్, ఓ కానిస్టేబుల్ ఉన్నారు. మరొకరికి గాయాలయ్యాయని తెలుస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







