ఈజిప్టులో బయల్పడిన 3500 ఏళ్లనాటి మమ్మీలు

- December 09, 2017 , by Maagulf
ఈజిప్టులో బయల్పడిన 3500 ఏళ్లనాటి మమ్మీలు

ఈజిప్టులోని దక్షిణ లక్సర్‌ పట్టణంలో 3500 ఏళ్లనాటి మమ్మీల సమాధులను తాజాగా కనుగొన్నారు. ఇందులో దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక సమాధిలోకి వెళ్లడానికి ఐదు మార్గాలు ఉన్నాయి. ఆరు మీటర్ల పొడవైన రెండో సమాధి నుంచి మరో నాలుగు గదులకు వెళ్లడానికి మార్గాలున్నాయి. నగిషీలు చెక్కిన చెక్క మాస్కులు, మట్టిపాత్రలు, ఇతర కళాకృతులు లభ్యమయ్యాయి. సమాధుల్లో రాసిన వివరాల ప్రకారం ఈ మమ్మీలు.. ఈజిప్టును ఏలిన ఫారో చక్రవర్తుల 18వ తరానికి చెందిన రాజవంశీకులవని తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com