బాలీవుడ్ హీరోతో ప్రిన్స్ సరికొత్త ప్రయోగం
- December 10, 2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన క్రేజ్ రోజు రోజుకి పెంచుకుంటూ వెళుతున్నాడు. మొన్నటి వరకు టాలీవుడ్ వరకే పరిమితమైన మహేష్ ఇటీవల స్పైడర్ చిత్రంతో కోలీవుడ్‌కి ఎంటర్ అయ్యాడు. స్పైడర్‌లో మహేష్ అందం చూసి కోలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ప్రస్తుతం మహేష్‌కి నేషనల్ వైడ్ క్రేజ్ ఉన్న నేపధ్యంలో పలు వాణిజ్య సంస్థలు ఆయనతో పలు యాడ్స్ చేస్తున్నాయి. గతంలో థమ్సప్ ప్రమోషన్ కోసం మహేష్ క్రేజ్ వాడుకున్న ఈ సంస్థ ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి నేషనల్ లెవల్లో ప్రమోషన్ చేస్తుంది. అయితే ఈ సారి బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ కూడా ఈ ప్రకటనలో నటించడం విశేషం. వీరిపై కాలిఫోర్నియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా పలు సన్నివేశాలు చిత్రీకరించినట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం భరత్ అనే నేను చిత్ర షూటింగ్‌తో బిజీగా ఉండగా, రణ్వీర్ నటించిన పద్మావతి చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. తాజాగా రూపొందిన థమ్సప్ యాడ్‌లో మహేష్ కాస్త స్లిమ్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







