ట్యాక్సీ సర్వీసుల ఫేర్స్ ప్రకటించిన మువసలాత్
- December 11, 2017
మస్కట్: మువసలాత్ ట్యాక్సీ సర్వీసులు 1 ఒమన్ రియాల్స్ నుంచి ప్రారంభం కానున్నాయి. మంగళవారం నుంచి ఈ సర్వీసుల్ని ప్రారంభిస్తున్నట్లు ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ (మవసలాత్) ప్రకటించింది. ప్రమోషనల్ ఆఫర్స్‌లో భాగంగా 1 ఒమన్ రియాల్స్ నుంచి ఫేర్స్ ప్రారంభం కానున్నాయి. ఈ ధరలు మాల్స్ నుంచి వర్తిస్తాయి. శనివారం నుంచి గురువారం వరకు కాల్ ట్యాక్సీ సర్వీసులు 1.2 ఒమన్ రియాల్స్‌కి అందుబాటులో ఉంటాయి. ప్రతి కిలోమీటర్‌కి అదనంగా 300 బైజాస్ చెల్లించాల్సి ఉంటుంది. సాయంత్రం సమయాల్లో 1.3 ఒమన్ రియాల్స్, 1.5 ఒమన్ రియాల్స్ నుంచి ధరలు ప్రారంభమవుతాయి. కిలోమీటర్‌కి 350 బైజాస్ చెల్లించాలి. మాల్స్ కోసం 125 ట్యాక్సీలను ప్రారంభించగా, 2018 జనవరి నుంచి 100 కార్లను ఎయిర్పోర్ట్ ట్యాక్సీలుగా అందుబాటులోకి తెస్తారు. ఎయిర్పోర్ట్ ట్యాక్సీల ధరల్ని ముందు ముందు తగ్గిస్తామని ఇప్పటికే మవసలాత్ ప్రకటించింది. మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గత ఏడాది మువసలాత్, మర్హాబాలకు ట్యాక్సీ సర్వీసులకోసం అనుమతి లభించింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







