వైల్డ్ లైఫ్ చట్టం ఉల్లంఘన: ముగ్గురు గల్ఫ్ జాతీయుల అరెస్ట్
- December 11, 2017
మస్కట్: వైల్డ్ లైఫ్ చట్టాన్ని ఉల్లంఘించిన కేసులో ముగ్గురు గల్ఫ్ జాతీయులు అరెస్ట్ అయ్యారు. దహిరాలోని ఇబ్రిలో ఈ ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ ఎఫైర్స్ (ఎంఇసిఎ) అధికారి ఒకరు మాట్లాడుతూ, గన్స్, పేలుడు పదార్థాలు, డ్రోన్, నెట్స్, ట్రాప్స్, టార్చ్‌లైట్, ఫ్లడ్ లైట్, బైనాక్యులర్, కమ్యూనికేషన్ హ్యాండ్‌సెట్ వంటివి వీరి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఫ్రోజెన్ బర్డ్ మీట్, బర్డ్ సౌండ్ సిమ్యులేటర్స్, మూడు 4డబ్ల్యుడిఎస్, 14 బర్డ్స్, రెండు రకాలైన పావురాల్ని కూడా వీరి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. నేరం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. నేచుర్ రిజర్వ్స్ మరియు వైల్డ్ లైఫ్ కన్సర్వేషన్ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను వీరిపై కేసులు నమోదుచేసి, జ్యుడీషియరీకి అప్పగించడం జరిగింది. ఈ తరహా ఉల్లంఘనలు తమ దృష్టికి వస్తే పౌరులు సమాచారం ఇవ్వాలని రాయల్ ఒమన్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







