'ఈబీ5' వీసా దరఖాస్తు గడువు పెంపు!
- December 12, 2017
వాషింగ్టన్: 'గోల్డెన్ వీసా'గా పరిగణించే ఈబీ5 వీసాల దరఖాస్తుకు గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. ఈ వీసాలు పొందాలనుకునే వారికి ఇది వూరట కల్పించే అంశమని, అయితే గడువు పొడిగింపునకు ఇదే చివరి అవకాశమని నిపుణుల అంచనా. ట్రంప్ పగ్గాలు చేపట్టిన తర్వాత హెచ్1-బీ వీసాల నిబంధనలు కఠినతరం చేయడంతో ఈబీ5 వీసాలకు ఆదరణ పెరిగింది. ఈ వీసా ప్రోగామ్‌ను 1990లో యూఎస్ కాంగ్రెస్ తీసుకొచ్చింది. దీని ప్రకారం వ్యక్తిగతంగా 5 లక్షల డాలర్లు అమెరికాలో పెట్టుబడి పెట్టి నిరుద్యోగ అమెరికన్ యువతకు ఉపాధి కల్పించాలి. అమెరికాలో స్థిరనివాసం ఏర్పరుచుకోవాలని అనుకునేవారికి ఇది నిజంగా 'గోల్డెన్ ఛాన్స్'. ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా హెచ్1-బీ వీసాలపై వెళ్లి అక్కడ స్థిరపడుతుంటారు. తమ కుటుంబాలతో సహా అక్కడ స్థిరపడాలనుకునే భారతీయులకు ఈబీ5 వీసా అవకాశం కల్పిస్తోంది. ప్రస్తుతం ఈ తరహా వీసాలను పొందడంలో భారతీయులు ఆరో స్థానంలో ఉన్నారు. హెచ్1-బీ నిబంధనలు కఠినతరం అయిన నేపథ్యంలో ఈబీ5కి ఆదరణ పెరిగిందని, భారత్ నుంచి ఈ తరహా వీసాలకు దరఖాస్తులు కూడా పెరగనున్నాయని విశ్లేషకులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు







