భారత అమ్ముల పొదిలో మరో అధునాతన ఆయుధం!
- December 12, 2017
ఢిల్లీ: భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అధునాతన ఆయుధ వ్యవస్థ చేరనుంది. రష్యన్ ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విక్రయ ఒప్పందంపై భారత్, రష్యా త్వరలోనే సంతకాలు చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకుంటున్నట్టు రష్యా వెల్లడించింది. ధర, శిక్షణ, సాంకేతికత బదిలీ, నియంత్రణ వ్యవస్థల ఏర్పాట్లపై భారత్, రష్యా మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఎస్-400ను సరఫరా చేసినా వ్యవస్థ గురించి శిక్షణనిచ్చేందుకు రెండేళ్లు పడుతుంది. రష్యా నుంచి ఐదు బిలియన్ డాలర్లతో ఎస్-400 ట్రయంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలు చేస్తామని గతేడాది అక్టోబర్లో భారత్ ప్రకటించింది. దాంతోపాటు రెండు దేశాలు సంయుక్తంగా కమోవ్ హెలికాఫ్టర్ల తయారీ చేపడతాయని తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







