వరుసగా రెండోరోజు భూకంపం... వణుకుతున్న ఇరాన్
- December 12, 2017
టెహ్రాన్(ఇరాన్): ఇటీవల వరుస భూకంపాలతో ఇరాన్ ప్రజలు వణికిపోతున్నారు. నిన్న కెర్మాన్ ప్రావిన్స్‌లో చోటుచేసుకున్న భూకంపం మర్చిపోకముందే... మళ్లీ ఈరోజు ఉదయం ఉత్తర, మధ్య ఇరాన్‌ను భూప్రకంపనలు కుదిపేశాయి. రిక్టర్ స్కేలు వద్ద ఇవాళ చోటుచేసుకున్న భూకంప తీవ్రత 6.1గా నమోదైంది. భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టంపై ఇంకా సమాచారం లేదు. అత్యంత సమస్యాత్మక రేఖలపై ఉండడంతో భూకంప బాధిత దేశంగా మారిన ఇరాన్.. ఇటీవల అపార నష్టం చవిచూస్తోంది. నిన్న కెర్మాన్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో భూకంపం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సరిగ్గా నెలరోజుల క్రితం 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇరాన్ పశ్చిమ ప్రావిన్స్ కెర్మాన్షాను అతలాకుతలం చేసింది. ఈ భూవిలయంతో 530కి పైగా ప్రాణాలు కోల్పోగా... దాదాపు 8వేల మంది గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







