రాజమౌళి ఓకే చేశాకే అమరావతి ఫస్ట్ లుక్ రిలీజ్!
- December 13, 2017
'ఎవరేమన్నా నాకు మాత్రం రాజమౌళి మాటే శాసనం' అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అమరావతిలో నిర్మించతలపెట్టిన అసెంబ్లీ, హైకోర్టు శాశ్వత భవనాల నమూనాలు.. రాజమౌళి నిర్ణయం కోసం వెయిటింగ్ లో వున్నాయి. టాలీవుడ్ జక్కన్న ఇప్పటికే ఓటేసి ఓకే చేసిన డిజైన్ల మీద ప్రజాభిప్రాయ సేకరణ కూడా జరిగింది. ఈ క్రమంలో రాజమౌళి బుధవారం ఏపీ సెక్రటేరియట్ కి వచ్చి.. చంద్రబాబుతోను, సీఆర్డీఏ అధికారులతోనూ భేటీ అయ్యారు. ఇప్పటికే ఈ అంశంపై రెండుమూడు సార్లు సమావేశమైనప్పటికీ.. ఇవ్వాళ్టిది తుది భేటీగా చెబుతున్నారు. ఈరోజు సీఎం ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో.. ఈ డిజైన్ల విషయాన్ని కూడా ఫైనలైజ్ చేసి.. కేంద్రం వద్ద గ్రీన్ సిగ్నల్ తీసుకురావాలన్నది ప్లాన్. ఈ భేటీలో రాజమౌళితో పాటు మంత్రి నారాయణ, నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల