విమానం హైజాక్ చేస్తారంటూ ఫోన్‌కాల్.. శంషాబాద్ విమానాశ్రయంలో భారీ భద్రత
- December 12, 2017
శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బీహార్ నుంచి సానియా భాహర్ అనే మహిళ శంషాబాద్ పోలీసులకు ఫోన్ చేసి విమానం హైజాక్ విషయంపై మాట్లాడింది. ఈ నెల 24న లక్నోకు చెందిన షోయబ్ అనే యువకుడు శంషాబాద్ నుంచి జెడ్డాకు వెళ్తున్నాడని, అతనికి ఐఎస్ఐతో సంబంధముందని చెప్పింది. పేలుడు పదార్థాలతో విమానం ఎక్కి హైజాక్ చేసే ప్లాన్ చేస్తున్నాడని అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో ముంబై పోలీసులు సానియా భాహర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇటు షోయబ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







