డిఫ్ఫరంట్ లుక్ లో అదరగొడుతున్న రెజీనా

- December 13, 2017 , by Maagulf

నేచురల్ స్టార్ నాని సొంత ప్రాజెక్ట్ 'అ'. ఇందులో నటించే నటీనటుల అవతారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే నిత్యామీనన్, అవసరాల శ్రీనివాస్ ఫస్ట్ లుక్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు రెజీనా వంతైంది. ఆఫ్రికన్ స్టయిల్‌లో దర్శనమిచ్చింది ఈ బ్యూటీ.

రెజీనాని ఈ లుక్‌లో చూసి ఆశ్చర్య పోతున్నారు ఆమె హార్డ్‌కోర్ ఫ్యాన్స్. శరీరంపై టాటూ, హెయిర్ స్టయిల్, అబ్బో ఇవన్నీ చూస్తుంటే ఈ సుందరి మంత్రగత్తెగా కనిపిస్తుందంటూ రకరకాల స్టోరీలు సోషల్‌మీడియాలో దర్శనమిస్తున్నాయి. మొత్తానికి 'అ' ఫస్ట్ నుంచి మొదలు రెజీనా వరకు అన్ని పోస్టర్లు డిఫరెంట్‌గా వుండడంతో మూవీపై అంచనాలు రెట్టింపయ్యాయి. ప్రశాంత్‌వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి ప్రశాంతి త్రిపురనేని నిర్మాత.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com