146,000 మాదక ద్రవ్యాల మాత్రలతో బంగ్లాదేశ్ నిందితుడు అరెస్టు
- December 13, 2017
కువైట్ : ఎంతటి పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉన్నప్పటికీ అక్రమంగా మాదక ద్రవ్యాలు కువైట్ లోనికి వస్తూనే ఉన్నాయి. 146,000 నార్కోటిక్ మాత్రలు మరియు సైకోట్రోపిక్ పదార్ధాలను కలిగిన బంగ్లాదేశ్ నిందితుడిని మంగళవారం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ అరెస్టు చేసింది.ముబారక్ అల్ కబేర్ గవర్నైట్ ఇంటెలిజన్స్ శాఖ అనుమానితుడిపై నిఘా ఏర్పాటుచేసింది. నిందితుడి నుంచి పక్కాగా రహస్యవేషంలో ఉన్న ఓ అధికారి 200 మాదకద్రవ్యాల మాత్రలను 100 కువైట్ దినార్లకు కొనుగోలు చేసిన తర్వాత బంగ్లాదేశ్ నిందితుడిపై స్టింగ్ ఆపరేషన్ ప్రారంభమైందని మంత్రిత్వశాఖకు చెందిన మరొక అధికారి పేర్కొన్నారు. నీలం రంగు కవరులలో 146,000 మాదక ద్రవ్యాల మాత్రలను దాచిపెట్టాడు, మరియు వ్యక్తిగత ఉపయోగం తానూ దాచుకొన్నట్లు నిందితుడు పోలీసులతో వాదానికి దిగడంతో అనుమానితుడిని మరియు స్వాధీనం చేసుకున్న మత్తు పదార్ధాలు ప్రత్యేక సంస్థలకు సూచించబడ్డాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







