ఐదుగురి హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ అరెస్ట్
- December 13, 2017
మస్కట్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ఐదుగురి హత్య కేసుతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని ఒమన్‌లో అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వలసదారుడ్ని, యూఏఈ అధికారులకు అప్పగించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్న స్టేట్మెంట్ ప్రకారం, యూఏఈలో కొన్ని రోజుల క్రితం ఐదుగుర్ని హత్య చేసిన ఆసియా జాతీయుడ్ని బురైమీలో అరెస్ట్ చేసి, యూఏఈ అథారిటీస్‌కి అప్పగించినట్లు స్పష్టమవుతోంది. మస్కట్ కమ్యూనికేషన్స్ డివిజన్ (ఇంటర్‌పోల్), యూఏఈ అథారిటీస్ నుంచి ఈ మోస్ట్ వాంటెడ్కి సంబంధించిన సమాచారం అందుకుంది. కేసు విచారణ చేపట్టి, నిందితుడ్ని బురైమీలో అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్







