ఒమన్‌లో వలసదారులకు స్వేచ్ఛ, సౌకర్యవంతం: ఇండియన్ మినిస్టర్
- December 13, 2017
మస్కట్: ఇండియన్ మినిస్టర్ డాక్టర్ మహేష్ శర్మ, ఒమన్‌లో భారతీయ వలసదారులకు స్వేచ్ఛ, సౌకర్యవంతమైన జీవితం లభిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఒమన్ కల్పిస్తున్న ఈ భద్రతను ఆయను ప్రత్యేకంగా కొనియాడారు. ప్రతి సంవత్సరం 80,000 మంది ఒమనీయులు భారత్‌ని సందర్శిస్తున్నట్లు చెప్పారాయన. ఒమన్‌లో 20 శాతం మంది భారతీయులు ఉండటం గొప్ప విషయమని కూడా అన్నారాయన. ఒమనీయులు ఇండియాకి పర్యాటకం కోసం, వ్యాపార పనుల నిమిత్తం, అలాగే ఆరోగ్య పరమైన అవసరాల కోసం వస్తుంటారనీ, అలాగే ఒమన్‌కి వెళుతున్న భారతీయుల సంఖ్య కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉందని వివరించారు మహేష్ శర్మ. పర్యాటకం, ఆరోగ్యం, వ్యాపారం వివిధ దేశాల్ని కలిపి ఉంచుతోందనీ ఒమన్ - భారత్ మధ్య సంబంధాలు ముందు ముందు ఇంకా బలోపేతం అవ్వాల్సి ఉందని అభిప్రాయపడ్డారాయన.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







