అమర్‌నాథ్ గుహలో ఇకపై మంత్రం వినిపించదు

- December 14, 2017 , by Maagulf
అమర్‌నాథ్ గుహలో ఇకపై మంత్రం వినిపించదు

హిందువుల ఆలయాలు మంత్రోచ్ఛారణకు నిలయాలు. ఆలయంలోకి ప్రవేశించగానే పండితుల వేద మంత్రాలు చెవులకు వీనుల విందుగావిస్తాయి. హారతి కర్పూరపు వాసనలు, ద్వారంలోని గంటలు భక్తులను దేవుని దగ్గరకు చేరుస్తుంది. అయితే ఇకపై హిందువులు అతి పవిత్రంగా భావిచే ఆదిశంకరుడు కొలువైన అమరనాథ్ ఆలయంలో మాత్రం మంత్రాలు, గంటల జైజై ధ్వానాలు వినిపించకూడదని ఆలయ అధికారులని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బోర్డ్ (ఎన్జీటీ) ఆదేశించింది. వీటితో పాటు మరికొన్ని ఆంక్షలు కూడా పెట్టింది. భక్తులు క్యూలైన్ పాటించాలని, దేవుని సన్నిధానానికి వచ్చేటప్పుడు మొబైల్స్ తదితర వస్తువులను తీసుకువెళ్లరాదని, భక్తులు తమ వస్తువులు భద్రపరుచుకునేందుకు స్టోర్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆలయ అధికారులను ఎన్జీటీ ఆదేశించింది. ఆలయ మార్గంలో షాపులకు అనుమతివ్వరాదని పేర్కొంది. వివిధ ప్రాంతాలనుంచి ఎంతో వ్యయప్రయాసలకోర్చి భక్తులు అమర్‌నాథ్‌ను సందర్శిస్తారు. వారికి సరైన సదుపాయాలను కల్పించాల్సిన బాధ్యతని విస్మరించరాదని అధికారులను మందలించింది. ఆలయ పవిత్రతను కాపాడాలంటూ ఎన్జీటీ విజ్ఞప్తి చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com